Samantha: నెటిజన్ కామెంట్స్‌కి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన సమంత..!

సోషల్ మీడియా అనేది ప్రపంచమంతా వ్యాపించేసింది.. మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.. సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్యులు, సెలబ్రిటీల మధ్య దూరం తగ్గిపోయిందనే చెప్పాలి.. తెరమీద చూసి సంబరపడే ఫ్యాన్స్, నెటిజన్స్ తమ ఫేవరెట్ స్టార్లను ఫాలో చేస్తూ.. వారితో లైవ్ చాట్స్‌లో ముచ్చటిస్తూ సంబర పడిపోతుంటారు.. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ చేసి సెలబ్స్‌ని ఇబ్బంది పెడుతుంటారు..అలాంటప్పుడు వాళ్లు బ్లాక్ చేసి ఊరుకోవడమో, లేక పట్టించుకోకపోవడమో చేస్తుంటారు..

కొంతమంది స్టార్స్ మాత్రం స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంటారు.. ఇప్పడలాంటి ఓ స్వీట్ వార్నింగ్ లాంటి రిప్లై ఇచ్చింది సమంత.. తన లుక్స్ గురించి వివరంగా అనవసరపు కామెంట్స్ చేసిన నెటిజన్‌కి చాలా ఓపిగ్గా.. ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకుండా బదులిచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు..

గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.. మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జును కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది..

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో విడుదల కానున్న ‘శాకుంతలం’ ట్రైలర్ సోమవారం (జనవరి 9) రిలీజ్ చేశారు.. ట్రైలర్ విడుదల ఈ కార్యక్రమంలో సామ్ లుక్ గురించి ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ‘‘సమంతను చూస్తే శాడ్‌గా ఫీలవుతున్నాను. తన ఛార్మ్ ఇంకా గ్లో మొత్తం పోయింది. అందరూ తను డివోర్స్‌లో నుండి స్ట్రాంగ్‌గా బయట పడిందని, ప్రొఫెషనల్‌గా బాగా పీక్‌లో ఉందని అనుకుంటున్నారు.

కానీ, మయోసైటిస్ తనను గట్టిగా దెబ్బ కొట్టి.. మళ్లీ వీక్ చేసేసింది’’ అంటూ కామెంట్ చేశాడు.. దీనికి తన స్టైల్లో రిప్లై ఇచ్చింది సమంత ‘‘నేను తీసుకున్నట్టు నెలల కొద్ది ట్రీట్‌మెంట్ అలాగే మెడికేషన్స్ నువ్వెప్పటికీ తీసుకోకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీకు గ్లో యాడ్ చేయడానికి నా ప్రేమను కూడా పంపిస్తున్నాను’’ అంటూ సమాధానమిచ్చింది. సామ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus