ఆగస్టు 15 న ‘ఖుషి’ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. దీనికి సమంత కూడా హాజరైంది. అంతకు ముందు ట్రైలర్ లాంచ్ వేడుకను పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తే.. దానికి సమంత హాజరు కాలేదు. మొత్తానికి ఆడియో వేడుకకు హాజరైంది. ఆ వేడుకలో విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజి పై డాన్స్ కూడా చేసింది. ఆ వీడియోలు రెండు, మూడు రోజుల పాటు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘ఖుషి’ కి ఆమాత్రం ప్రమోషన్ చాలు అనే కామెంట్స్ కూడా గట్టిగా వినిపించాయి.
అయితే ఆ తర్వాతి రోజు సమంత (Samantha) న్యూయార్క్ కి వెళ్లడం జరిగింది. ఈ మధ్యనే ఆమె హెల్త్ కండిషన్ బాగోవడం లేదు. బహుశా అందుకే ఆమె చికిత్స కోసం వెళ్ళింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. పైగా సినిమాలకు సమంత గ్యాప్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే సమంత.. అమెరికా వెళ్ళడానికి కారణం వేరే ఉంది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్ లో ‘ఇండియా డే పరేడ్’ వేడుకలను జరుపుతూ ఉంటారు.
ఆదివారం నాడు అంటే ఆగస్టు 20 న మధ్యాహ్నం ఇవి ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సమంత కూడా పాల్గొంది. ఆమెతో పాటు ఆధ్యాత్మిక గురువు అయిన రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వారు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ విషయం పై సమంత మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను న్యూయార్క్ లో ఉండటం పట్ల ఎంతో గర్వ పడుతున్నాను. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవనే విషయాన్ని ఇక్కడి దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి.
ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవి. ఈ అరుదైన గౌరవం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.అలాగే నా సినిమాలు ఆదరిస్తున్న అమెరికన్ ఆడియన్స్ కి కూడా స్పెషల్ థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చింది. గతంలో జరిగిన ‘ఇండియా డే పరేడ్’ వేడుకల్లో అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్స్ కూడా హాజరయ్యారు