Mahesh Babu, Rajamouli: హీరోయిన్ సమంత గురించి ఈ వార్త నిజమేనా?

నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత పరువుకు భంగం కలిగించేలా ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించి ఫేక్ వార్తలకు సమంత చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే సమంత మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. సమంత బాలీవుడ్ పై దృష్టి పెడుతున్నారని వార్తలు వచ్చినా ఆ వార్తలు సైతం నిజం కాలేదు. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు అందరినీ కలుపుకుని వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటునాటు సాంగ్ రిలీజైన కొంత సమయానికే సమంత ఆ పాట గురించి పాజిటివ్ గా స్పందించారు. సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ వస్తే సమంత జాతకం మారుతుందని చెప్పాలి. జక్కన్న మహేష్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తోంది. మహేష్ సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన దూకుడు,

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అయింది. అయితే రాజమౌళి మహేష్ కాంబో సినిమాలో సమంతకు నిజంగా ఛాన్స్ దక్కిందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ దాదాపుగా 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. సమంత సైతం పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus