Samantha: సాయి పల్లవి తరహాలోనే రుద్రాక్షలు ధరించిన సమంత… సమంతలో ఈ మార్పుకు కారణమేంటి?

సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇక ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే తన సినిమా పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. ఈమె నటించిన యశోద సినిమా డబ్బింగ్ పనులను కూడా డాక్టర్ సహాయంతో పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇలా చాలా కాలం తర్వాత ఈమె మీడియా ముందుకు రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు సమంత నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ సినిమాపై తనకున్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టారు. తనకు ఒంట్లో ఓపిక లేకపోయినా ఈ ఫంక్షన్ కి రావాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చానని తెలిపారు.ఇక వేదికపై డైరెక్టర్ గుణశేఖర్ సమంత గురించి మాట్లాడటంతో సమంత వేదిక పైన కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక సమంత నేడు మీడియా ముందుకు రావడంతో ఈమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంత మాత్రం చేతికి రుద్రాక్ష మాల ధరించి కనిపించారు. ఈ విధంగా సమంత రుద్రాక్ష మాల ధరించడంతో సమంతలో కొత్తగా ఈ మార్పు ఏంటి ఎందుకు ఆమె రుద్రాక్షలు వేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు వారి టాలెంట్ తో పాటు జాతకాలు న్యూమరాలజీలను పెద్ద ఎత్తున నమ్ముతుంటారు.

ఈ క్రమంలోనే సమంత కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారా అందుకే రుద్రాక్షలు ధరించారా అనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అలాగే గతంలో యశోద సినిమా విడుదల సమయంలో కూడా ఈమె చేతికి రంగురాళ్లు ఉండటం గమనార్హం.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus