సమంత-శర్వానంద్ జంటగా తెరకెక్కిన జాను ఈనెల 7న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. స్కూల్ డేస్ లో ప్రేమలో పడిన ఓ జంట చాల కాలం తరువాత మళ్ళీ కలిస్తే…కలిసినా మళ్ళీ ఒకటి కాలేని స్థితిలో వారు ఉంటే అనే సున్నితమైన పాయింట్ ఆధారంగా జాను మూవీ తెరకెక్కింది. జాను తమిళ చిత్రం 96 కి తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. కాగా జాను చిత్రంలో సమంత ఇమేజ్, స్టార్ డమ్ రీత్యా కొన్ని మార్పులు చేశారని తెలుస్తుంది. జాను లో సమంత శర్వా పాత్రలకు సమాన స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఆమెకు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడ్డారని తెలుస్తుంది.
సమంత చేస్తున్న జాను పాత్రకు ఎక్కువ డెప్త్ ఉండేలా దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. నిజానికి ఒరిజినల్ తమిళ చిత్రం 96 లో త్రిషా పాత్రకు మించిన ప్రాధాన్యత విజయ్ సేతుపతి పాత్రకు ఉంటుంది. కథలో అసలైన శాక్రిఫైస్ చేసిన వాడిగా విజయ్ సేతుపతి పాత్ర లోతైన వేదన కలిగి ఉంటుంది. ఎమోషనల్ గా కూడా త్రిషా పాత్ర కంటే కూడా విజయ్ సేతుపతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. జాను చిత్రంలో ఒరిజినల్ కథకు ఎటువంటి మార్పులు చేయకుండానే సమంత పాత్ర ఎలివేట్ అయ్యేలా చేశారని తెలుస్తుంది. మరి సినిమా విదులైతే కానీ ఈ వార్తలలోని నిజం తెలియదు. జాను చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. గోవింద్ వసంత్ సంగీతం అందించారు.