ఎప్పడు ఎలాంటి సినిమా వర్కవుట్ అవుతుంది అనే విషయాన్ని ఎవ్వరూ ఊహించలేరు. కానీ.. ఒక్కోసారి ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు ఒకచోట హిట్టై, మరోచోట ఫ్లాపవుతుంటాయి. రీసెంట్ గా మరోసారి ఇదే తరహా విషయం జరిగింది సౌత్ లో జరిగింది. తెలుగులో గత నెల “కొత్తపల్లిలో ఒకప్పుడు” అనే సినిమా విడుదలై రానా ఇన్వాల్వ్మెంట్ కారణంగా మంచి బజ్ క్రియేట్ చేసినా కంటెంట్ ఎంగేజ్ చేయలేక బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయింది. కానీ.. అదే తరహా కాన్సెప్ట్ తో కన్నడలో తెరకెక్కిన “సు ఫ్రమ్ సో” మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
“కొత్తపల్లిలో, సు ఫ్రమ్ సో” ఈ రెండు సినిమాలూ మట్టి కథలుగా తెరకెక్కబడినవి. కుదిరినంత తక్కువ బడ్జెట్ లో రూపొందించబడినవే. రెండూ మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కాగా.. “కొత్తపల్లిలో” దేవుడు సృష్టించబడితే, “సు ఫ్రమ్ సో”లో దెయ్యం సృష్టించబడుతుంది. దాని బారి నుండి ఊరు లేదా హీరో ఎలా బయటపడ్డారు అనేదే సినిమా మెయిన్ థీమ్.
Su From So
కొత్తపల్లి సహజంగా తెరకెక్కించబడిన సినిమా అయినప్పటికీ.. సినిమాకి చాలా క్రూషియల్ జస్టిఫికేషన్ కి క్లారిటీ లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు.
“సు ఫ్రమ్ సో” విషయానికి వచ్చేసరికి కాస్త లాజిక్కులు మిస్ అయినా కూడా కామెడీ మాత్రం భీభత్సంగా వర్కవుట్ అయ్యింది. దాంతో జనాలు థియేటర్లకి క్యూ కట్టారు. సో, ఆడియన్స్ కి కావాల్సింది క్వాలిటీ, స్టార్స్, పాన్ ఇండియన్ రిలీజులు కాదు.. కంటెంట్ మాత్రమే ముఖ్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే చిన్న సినిమాలు సర్వైవ్ అవుతాయి. లేదంటే మాత్రం వచ్చి వెళ్లిపోయినట్లు కూడా జనాలకి తెలియదు.