దర్శకుడు సంపత్ నంది తన ‘సీటీమార్’ సినిమా కోసం 700 మందిని ఆడిషన్ చేసి అందులో నుంచి 24 మందిని ఎంపిక చేసుకున్నారట. వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక సినిమా మొదలుపెట్టినట్లు సంపత్ నంది చెప్పుకొచ్చారు. ‘సీటీమార్’ కబడ్డీ నేపథ్యంలో సాగే సినిమా. కబడ్డీ మీద తనకు చిన్నప్పటి నుండి ఆసక్తి ఉందని.. తాను కూడా కబడ్డీ ఆడానని.. అయితే ప్రో కబడ్డీ లీగ్ చూస్తున్నప్పుడు తనకు కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచన పుట్టిందని.. ఆ తరువాత ‘సీటీమార్’ కథ రాశానని సంపత్ నంది వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ గా కనిపించే 24 మందిని ఎంచుకోవడం కోసం చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ 24 మంది కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు సంపత్ తెలిపాడు. నటన వచ్చి.. కబడ్డీ మీద కాస్త అవగాహన ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని చెప్పాడు. ఫైనల్ గా నేషనల్ లెవెల్ లో కబడ్డీ ఆడిన నలుగురు క్రీడాకారుణాలను ఈ సినిమా కోసం తీసుకున్నామని… వాళ్లకు మూడు నెలలు నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో నటింపజేశామని తెలిపాడు.
ఆడిషన్స్ పూర్తయిన తరువాత కబడ్డీ శిక్షణ కోసం మూడు, నాలుగు నెలలు కేటాయించామని గేమ్ గురించి లోతుగా తెలుసుకొని ఒక అథెంటిక్ స్పోర్ట్స్ మూవీలా ‘సీటీమార్’ను తీర్చిదిద్దడానికి ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో కేవలం కబడ్డీ మాత్రమే కాకుండా ఎమోషన్స్, యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలిపాడు. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని చాలా రోజులుగా ఎదురుచూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!