ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పటికి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాదు ఇది రాజమౌళికి ఎంతో ఇష్టమైన చిత్రం కూడా..!నిజానికి ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. అయినప్పటికీ ‘విక్రమార్కుడు’ కి రవితేజ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు.
అత్తిలి సత్తిగా నవ్వించినా… విక్రమ్ రాథోడ్ గా పౌరుషం చూపించినా అది రవితేజకే చెల్లింది. ఇదిలా ఉండగా.. ‘విక్రమార్కుడు’ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని ఉన్నట్టు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ రాజమౌళి ఇప్పట్లో ఖాళీ అవ్వడు. అయితే మరో మాస్ దర్శకుడు సంపత్ నంది ‘విక్రమార్కుడు’ కి సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఆల్రెడీ రవితేజని అప్రోచ్ అవ్వడం జరిగింది. విశేషం ఏమిటంటే.. రవితేజకి కూడా ఈ స్క్రిప్ట్ నచ్చింది.
కానీ ‘విక్రమార్కుడు’ కి సీక్వెల్ అంటూ నేను చేస్తే రాజమౌళితో చేస్తేనే బాగుంటుంది అంటూ సున్నితంగా తిరస్కరించాడట. దీంతో సంపత్ నంది.. అదే స్క్రిప్ట్ ను మరో హీరోతో వేరే టైటిల్ తో చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. సంపత్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. హీరో ఫైనల్ అయితే ఆ ప్రాజెక్టు తెరకెక్కడం ఖాయమని తెలుస్తుంది. ‘సీటీమార్’ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన సంపత్ నెక్స్ట్ మూవీ పై ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి పడింది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!