Samyuktha Menon: సాయి ధరమ్ తేజ్ కూడా సంయుక్త పైనే ఆధారపడుతున్నాడా..?

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉంది. కాస్త పేరున్న హీరోయిన్లంతా పెద్ద హీరోల సరసన నటిస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోలకు కొత్త హీరోయిన్లే దిక్కు అన్నట్టు ఉంది పరిస్థితి. ఇలాంటి టైంలో కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చింది. ఈమెను టాలీవుడ్ అంతా గోల్డెన్ లెగ్ అంటుంది. ఈమె నటిస్తే సినిమా సూపర్ హిట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ తో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలో రానా భార్యగా.. పవన్ కు చెల్లెలి టైపు పాత్రలో నటించింది. అటు తర్వాత ‘బింబిసార’ లో కూడా నటించింది. ఆ మూవీ కూడా హిట్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘సార్’ మూవీ కూడా హిట్ అయ్యింది. సంయుక్త మీనన్ కి కాస్తో కూస్తో నటించే స్కోప్ దొరికింది ‘సార్’ మూవీలో మాత్రమే..! మిగిలిన రెండు సినిమాల్లో ఆమె పాత్రలు అంతంత మాత్రమే. ‘భీమ్లా నాయక్’ లో ఆమె క్యారెక్టర్ పేరు ఏంటని అడిగితే వికీపీడియా చూడకుండా ఎవ్వరూ చెప్పలేరు.

అయినా సరే.. ఆమె సక్సెస్ క్రెడిట్ లో అది కూడా పడుతుంది. టాలీవుడ్లో (Samyuktha Menon)ఆమెకి హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. అలా అని అది పూర్తిగా ఆమె టాలెంట్ వల్ల అనైతే చెప్పలేం. 2016 వ సంవత్సరం నుండి ఆమె సినిమాల్లో నటిస్తోంది. మలయాళం, తమిళ సినిమాల్లో ఆమె ఎక్కువగా నటించింది.

కానీ పేరొచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే..! అయినా ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా.. ‘సంయుక్త గోల్డెన్ లెగ్ కాబట్టి నాకు కలిసొస్తుంది’ అని చెబుతున్నాడు. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి..!

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus