‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఇందులో రానా వైఫ్ క్యారెక్టర్ చేసింది. అంతకుముందు 2016లో మదర్ టంగ్ మలయాళంలో ‘పాప్ కార్న్’ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సంయుక్త సెకండ్ సినిమా.. వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నా కానీ ఇంకా సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుందీ బ్యూటీ..

ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కాస్త యాక్టివ్ గానే ఉండే ఈ పాప.. అదే వేదికగా వలపు వయ్యారాలు విసురుతూ మేకర్స్‌కి ఆఫర్స్ కోసం హింట్ ఇస్తోంది. తను షేర్ చేసే పిక్స్ పద్ధతిగా, గ్లామర‌స్‌గా కుర్రకారుని కవ్విస్తూ ఉంటాయి.. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఫోటోషూట్స్ చేయడంలో సంయుక్త కాస్త స్పీడ్‌గానే ఉంటుంది. బొద్దుగా ముద్దుగా ఉండే సంయుక్త ఇమేజెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాలో 1.9 మిలియన్ల మంది తనను ఫాలో అవుతున్నారు.

‘గాలిపట 2’ (కన్నడ), ‘బూమరాంగ్’ (మలయాళం), వాతి (తమిళ్) ఇదే కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ‘సార్’ సినిమా.. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి.. సీనియర్ యాక్టర్ నాజర్‌తో రెచ్చిపోయిన రొమాన్స్ చేసిన ‘ఎరిడా’ (తమిళ్ – మలయాళం) ఫిల్మ్ 27 ఏళ్ల సంయుక్త మీనన్‌కి సాలిడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus