Samyuktha, Sai Tej: సాయితేజ్ కి జంటగా సంయుక్త మీనన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయితేజ్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తానై నడిపిస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా త్రివిక్రమే రాశారు. అయితే హారిక-హాసిని క్రియేషన్స్ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమాకి తన పేరు వేయించుకోవడం లేదు. దానికి బదులుగా తన సొంత నిర్మాణ సంస్థను ఈ ప్రాజెక్ట్ కి ఎటాచ్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఈ అవకాశం త్రివిక్రమ్ రికమెండేషన్ తో వచ్చినట్లు సమాచారం. ‘భీమ్లానాయక్’సినిమాతో త్రివిక్రమ్ కు, సంయుక్త మీనన్ కు అసోసియేషన్ ఏర్పడింది. ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఫ్యామిలీ మ్యాన్. కూతురికి పెళ్లి చేసే వయసు ఉంటుంది. కానీ రీమేక్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ లో పూర్తిగా మార్పులు చేసినట్లు సమాచారం.

సాయితేజ్ ను తీసుకొని, అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసి పెట్టారు. కథ ప్రకారం.. సినిమాలో హీరోకి యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు. అదే సమయంలో దైవ దూతగా పవన్ కళ్యాణ్.. హీరోకి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus