కొన్ని పాత్రలకు కొంతమంది వందకు వంద శాతం సెట్ అవుతుంటారు. ఆ ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు, తీసుకుంటున్నారు అని అనుకుంటే మనం ఒప్పుకోలేం. ఇంకొన్ని పాత్రలు అయితే ఆ హీరోయిన్ చేసి ఉంటే బాగుండేది, వేరే హీరోయిన్ చేసింది అనుకుంటూ ఉంటాం. అయితే ఇదంతా ప్రేక్షకుడు వెర్షన్‌లో. ఇలాంటి ఆలోచనే దర్శకులకూ ఉంటుంది. ఆ పాత్రను ఓ హీరోయిన్ అని అనుకుని రాశాక ఫైనల్‌గా కుదరదు. తాజాగా ఇలాంటి ఉదాహరణ ఒకటి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చెప్పుకొచ్చారు.
ఆయన బ్లాక్ బస్టర్ సినిమాల్లోని ఒకటైన ‘అర్జున్ రెడ్డి’ గురించి ప్రస్తావిస్తూ సాయిపల్లవి పేరును తీసుకొచ్చారు. ‘ప్రేమమ్’ నుంచి సాయి పల్లవికి అభిమానిని. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు హీరోయిన్ ఎవరా గురించి ఆలోచిస్తున్నప్పుడు సాయిపల్లవి (Sai Pallavi) పేరు ప్రస్తావనకి వచ్చిందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అయితే ఆ ఆలోచనను తన టీమ్ ఆదిలోనే కొట్టేసింది అని చెప్పారు. సాయిపల్లవి మీరు అనుకున్న పాత్రలోనే కాదు, స్లీవ్‌లెస్‌లో కూడా కనిపించరని ఓ కో ఆర్డినేటర్ చెప్పారని సందీప్ చెప్పారు.
దానికి తాను మొదట అందరూ అలాగే ఉంటారు అని, ఆ తర్వాత అవకాశాలు వస్తే చేస్తారు అని అనుకున్నానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమెలో అలాంటి మార్పు రాలేదని చెప్పారు సందీప్ రెడ్డి వంగా. సాయిపల్లవి (Sai Pallavi) గురించి తెలిసి కూడా ప్రీతి పాత్ర కోసం ఆమెను అనుకోవడం ఏంటో అని ఇప్పుడు అనిపిస్తోంది కదా. నాగచైతన్య గురించి మాట్లాడుతూ ‘కేడీ’ సినిమాకు పని చేస్తున్న సమయంలో చైతన్యను చూశానని, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కారు డ్రైవింగ్ అంతే తనకు ఇష్టమని చెప్పారు.
‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ (Animal) సినిమాల విషయంలో కాస్ట్యూమ్ డిజైనర్‌కు చైతన్య కాస్ట్యూమ్స్‌ను రిఫెరెన్స్‌గా చూపించేవాడినని తెలిపారు. ఇదంతా నాగచైతన్య – సాయిపల్లవి నటించిన ‘తండేల్’ (Thandel) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. తాను ‘మజిలి’ (Majili) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చానని ఆ సినిమా సాధించిన విజయం అందరికీ తెలుసని గుర్తు చేశారు సందీప్.