ఒకరి గురించి పరిచయం చేసినప్పుడు వేరొకరి గురించి తక్కువ చేస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి. దీనిని మామూలుగా పోలిక అని అంటారు కానీ.. ఇంకాస్త లోతుగా చెప్పాలి అంటే దెప్పడం అని అంటారు. అంటే టీజ్ చేయడం అన్నమాట. ఇప్పుడు ‘తండేల్’ (Thandel) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) అదే పని చేశారు. ఆయన కావాలని అలా అన్నారో లేక పోలిక చెప్పే క్రమంలో వచ్చిందో తెలియదు కానీ తన మేనల్లుడి సినిమా గురించి మరోసారి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కి కారణమైంది.
నాగచైతన్య (Naga Chaitanya) – సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం ‘పుష్ప’రాజ్ ఫర్ ‘తండేల్’రాజ్ అని ఈవెంట్ పెట్టారు. అయితే ‘పుష్ప’రాజ్ అలియాస్ అల్లు అర్జున్ (Allu Arjun) రాలేదు కానీ ఆయన తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) వచ్చారు. ఈవెంట్ జరుగుతుండగా దిల్ రాజును మాట్లాడమని దిల్ రాజుని ఆహ్వానించారు. ఆయనను పరిచయం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్.
ఈ సంక్రాంతికి దిల్ రాజు రికార్డు కొట్టారు. ఒక సినిమా కింది స్థాయిలో ఉంటే.. మరో సినిమా పై స్థాయిలో ఉండేలా చేశారు అంటూ చేతులతో సైగలు చేసి మరీ అల్లు అరవింద్.. దిల్ రాజు Dil Raju) గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి మరీ మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఆ కింద స్థాయిలో ఉన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అని, పై స్థాయిలో ఉన్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అని ఎవరైనా చెప్పేస్తారు. సినిమా అందుకున్న ఫలితం ప్రకారం అలా చెప్పడం తప్పు కాదు కాని,
ఏ చిన్న అంశం దొరికినా ఫ్యాన్ వార్స్ షురూ అవుతున్న ఈ రోజుల్లో మేనల్లుడి సినిమా గురించి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. డిజాస్టర్ సినిమాలకు కూడా బాకా ఊది, గాలి కొట్టి నిలబెడుతున్న టాలీవుడ్‌లో ‘గేమ్ ఛేంజర్’ తొలి షో తర్వాత అలా అనాథగా వదిలేసి.. దారుణమైన ఫలితానికి కారణం ఎవరు అనేది కూడా ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నట్లుగా ఈ ఈవెంట్ బట్టి మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే.. మళ్లీ అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు కలసిపోయారు.
దిల్ రాజు చరిత్ర సృష్టించాడు
ఒక సినిమాని (గేమ్ ఛేంజర్) ఇలా.. మరో సినిమాని (సంక్రాంతికి వస్తున్నాం) ఎక్కడికో తీసుకెళ్లాడు – అల్లు అరవింద్#AlluAravind #DilRaju #Thandel #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/yxF8zPksQB— Filmy Focus (@FilmyFocus) February 2, 2025