సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు సంక్రాంతి బరిలో దిగి నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతూ ఉంటాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పోటీకి నిలిచాయి.అయితే సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలన్నీ అర్థ దినోత్సవాన్ని పూర్తి చేసుకోవడంతో ఏ సినిమా సంక్రాంతి బరిలో సూపర్ హిట్ మూవీగా నిలిచిందనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళంలో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి విజయ్, అజిత్ సినిమాలు విడుదలయ్యాయి. జనవరి 11వ తేదీ విజయ్ నటించిన వరిసు సినిమా, అజిత్ నటించిన తునివు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు తెలుగులో కూడా వారసుడు, తెగింపు పేరిట విడుదల అయ్యాయి. ఇక జనవరి 12వ తేదీ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక జనవరి 13వ తేదీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తమిళంలో 11వ తేదీ విడుదలైన వరిసు సినిమా తెలుగులో జనవరి 14వ తేదీ వారసుడు పేరిట విడుదలైంది. ఈ సినిమాలన్నీ కూడా కలెక్షన్ విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఏ సినిమా టాప్ పొజిషన్లో నిలిచింది అనే విషయానికి వస్తే..
ఈ విధంగా ఈ నాలుగు సినిమాలన్నీ 50 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత కలెక్షన్ల విషయంలో ఏ సినిమా టాప్ పొజిషన్లో ఉందనే విషయానికి వస్తే తప్పనిసరిగా మెగాస్టార్ చిరంజీవి,బాబి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా టాప్ పొజిషన్లో ఉందని చెప్పాలి.ఈ సినిమా మిగిలిన మూడు సినిమాలను డామినేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇలా ఈ సినిమాలు 50 రోజుల థియేటర్ రన్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఓటీటీలలో సందడి చేస్తున్నాయి.