Sankranthiki Vasthunam Collections: ‘సంక్రాంతికి వస్తున్నాం’ .. 6వ రోజు ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డు కొట్టేసింది..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie)వంటి హిట్ల తర్వాత వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). దిల్ రాజు (Dil Raju)  నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం దర్శకుడు. ‘గోదారి గట్టు మీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాకి బజ్ తీసుకొచ్చింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

Sankranthiki Vasthunam Collections:

ఇక 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 6వ రోజు ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) రికార్డు బ్రేక్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. టికెట్ హైక్స్ వంటివి లేకపోయినా.. సినిమాకు రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఒకసారి (Sankranthiki Vasthunam) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 25.53 cr
సీడెడ్ 12.03 cr
ఉత్తరాంధ్ర 11.54 cr
ఈస్ట్ 8.92 cr
వెస్ట్ 5.87 cr
కృష్ణా 6.74 cr
గుంటూరు 7.44 cr
నెల్లూరు 2.99 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 81.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.35 cr
ఓవర్సీస్ 10.56 cr
టోటల్ వరల్డ్ వైడ్ 96.91 cr (షేర్)

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 6 రోజుల్లో రూ.96.91 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.55.91 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. 6వ రోజు అయితే… ఏకంగా ఈ సినిమా ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డు బ్రేక్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

పాన్‌ ఇండియా లేకుండా రూ.300 కోట్లు.. నెక్స్ట్‌ టార్గెట్‌ ఇదేనా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus