Santosh Sobhan: ‘సీతారామం’ ఈవెంట్‌లో సంతోష్‌ ఏం చేశాడంటే?

తెలుగులో హీరోలు లేరా? పక్క రాష్ట్రాల నుండి, పొరుగు ఇండస్ట్రీల నుండి హీరోలను తీసుకు రావాలా? ఏంటిది ఇంత ఓపెన్‌గా ప్రశ్నిస్తున్నారు అని అనుకుంటున్నారా? అవును, ఈ ప్రశ్న చాలా ఓపెన్‌గానే అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రశ్న మాది కాదు కాబట్టి. ఓ మలయాళ కుర్ర స్టార్‌ హీరో నటిస్తున్న ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వినిపించిన ప్రశ్న ఇది. కాదు కాదు ఆ సినిమా టీమ్‌ అడిగించి ప్రశ్న ఇది. ‘సీతారామం’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రశ్నతో ఓ కాన్సెప్ట్‌ వీడియోనే రన్‌ చేశారు.

ఈ పని చేసింది యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?’ అంటూ సంతోష్‌ శోభన్‌ అసహనం వ్యక్తం చేయడంతో ఓ వీడియోను రూపొందించారు . ‘సీతారామం’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ వీడియోలో చూపించారు

ఓ పథకం ప్రకారం చాలా సరదాగా చిత్రీకరించిన ఓ వీడియోలోని దృశ్యం ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ‘సీతారామం: స్వరాలు’ పేరుతో చిత్ర బృందం మ్యూజికల్‌ కన్సర్ట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. కొన్ని భాగాలుగా విడుదలైన ఈ వీడియోల్లోనిదే సంతోష్‌ శోభన్‌ ఫన్నీ కాన్సెప్ట్‌. ఈ వేడుకకు వచ్చేముందు సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ‘సీతారామం’ గురించి ఏం మాట్లాడుకున్నారు అనేదే ఆ వీడియోగా సరదాగా చూపించారు.

కార్యక్రమ వేదికపై ఆ వీడియోను ప్రదర్శించి.. సంతోష్‌, మాళవికను సుమ వేదికపైకి పిలిచారు. ‘‘తెలుగు సినిమా గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దుల్కర్‌ మనవాడు అనుకుంటా’’ అంటూ సంతోష్‌ ఓ సీన్‌ క్రియేట్‌ చేస్తాడు. అయితే ఆ పరీక్షలో దుల్కర్‌ పాసయ్యాడు. అలా దుల్కర్‌, సంతోష్‌ మధ్య ఫన్‌తో వీడియో రూపొందించారు. సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ అక్కడెందుకు ఉన్నారు అనే ప్రశ్న మీకు రావొచ్చు. వారిద్దరూ జంటగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నెట్‌వర్క్‌ (స్వప్న సినిమాస్‌) నిర్మిస్తోంది కాబట్టి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus