2002 వ సంవత్సరంలో నాగార్జున హీరోగా గ్రేసీ సింగ్, శ్రీయ హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సంతోషం’. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన అమ్మాయి.. ఓ అబ్బాయిని ప్రేమించి.. అతనే సర్వస్వమనుకుని వెళ్ళిపోయిన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటే.. అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె మరణిస్తుంది. తర్వాత అతని భర్త కుటుంబంలో మాత్రమే కాకుండా, ఆమె కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది.
ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి సంఘటనే చోటు చేసుకుంటే చివరికి ఏం జరిగింది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం. 127 కేంద్రాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా 83 కేంద్రాల్లో 50 రోజులు.. 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఈ మూవీలో నాగార్జున కొడుకు లక్కీ గా నటించిన మాస్టర్ అక్షయ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘బాయ్ బాయ్ హింస రాజు’ అంటూ అక్కడక్కడ కామెడీ పండిస్తూనే నాగార్జునతో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా నటించేశాడు.
సంతోషం సినిమా వచ్చి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ కుర్రాడు కూడా పెద్దోడు అయిపోయాడు. అతని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘వాంటెడ్’ మూవీలో ఇతను హీరోయిన్ అయేషా టాకియా కి తమ్ముడిగా నటించాడు.పలు యాడ్స్ లో కూడా ఇతను నటించాడు. ఇతని లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :