వైవిధ్యమైన కథ-కథనాలతో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు అలరించే అతి తక్కువ కథానాయకుల్లో ఒకడైన కార్తీ నటించిన తాజా చిత్రం “సర్దార్”. ఫస్ట్ లుక్ మొదలుకొని ట్రైలర్ వరకు అన్నీ విషయాల్లో భీభత్సమైన క్రూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ చిత్రం దీపావళి రేస్ లో భాగంగా నేడు (అక్టోబర్ 21) విడుదలైంది. మరి మిగతా మూడు సినిమాలను తట్టుకొని నిలబడిందా? కార్తీ ఎలాంటి హిట్ అందుకున్నాడు? అనేది చూద్దాం..!!
కథ: మంచి పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు.. పబ్లిసిటీ ప్రియుడు అయిన విజయ్ (కార్తీ). న్యాయం కంటే పబ్లిసిటీ దొరికే కేసులనే డీల్ చేస్తుంటాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా సాఫీగా సాగిపోతున్న విజయ్ జీవితంలోకి ఎంటరవుతాడు సర్దార్!. దాంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. సర్దార్ తోపాటు కొందరు రా ఏజెంట్లు కూడా ఎంటర్ అవుతారు.
అసలు సర్దార్ ఎవరు? రా ఏజెంట్లకు ఈ కథతో సంబంధం ఏమిటి? విజయ్ లైఫ్ ఎలా మారింది? అనేది “సర్దార్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఎప్పట్లానే కార్తీ తన బెస్ట్ ఇచ్చాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. విజయ్ కంటే సర్దార్ పాత్రలో బాగా నటించాడు కార్తీ. చాలా సీరియస్ రోల్లో అతడు జీవించిన విధానం బాగుంది. ఆడియన్స్ సర్దార్ పాత్రకు కనెక్ట్ అయ్యే విధానం బాగుంటుంది. రాజీషా విజయన్ & రాశీఖన్నాలు ఉన్నారంటే ఉన్నారు అన్నట్లు ఉన్నారు.
చంకీ పాండే క్యారెక్టరైజేషన్ ద్వారా కథను కీలక మలుపు తిప్పిన విధానం బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రేక్షకుల్ని అలరిస్తూ భయపెట్టడంలో సిద్ధహస్తులైన దర్శకుల్లో మిత్రన్ ఒకడు. శంకర్ తర్వాత మన చుట్టూ జరుగుతున్న అంశాలను వివరించి చెప్పి.. మనం ఎలాంటి భ్రమలో బ్రతుకుతున్నామో చూపించే దర్శకుడు మిత్రన్. “అభిమన్యుడు” చిత్రంతో డిజిటల్ ప్రపంచంలో మనం ఎంత నిస్సహాయంగా బ్రతుకుతున్నామో చూపించిన మిత్రన్.. “సర్దార్”లో మనం రోజూ వాడే వాటర్ బాటల్స్ వెనుక ఉన్న అంతుబట్టని కథను చూపించి నిజానికి దడ పుట్టించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఇరికించిన పాటలు, లవ్ ట్రాక్ డిలీట్ చేసి ఉంటే.. ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ గా “సర్దార్” సౌత్ సినిమా చరిత్రలో నిలిచిపోయేది.
జి.వి.ప్రకాష్ కుమార్ పాటల కంటే నేపధ్య సంగీతంతో అలరించాడు. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అన్నిటికంటే ఆర్ట్ వర్క్ డీటెయిలింగ్ మాత్రం అదిరింది. వి.ఎస్.ఎక్స్ వర్క్ కూడా బాగుంది.
విశ్లేషణ: సెకండాఫ్ ఓ వచ్చే ల్యాగ్ ను కాస్త భరించగలిగితే.. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం కచ్చితంగా చూడదగ్గ చిత్రం “సర్దార్”. కార్తీ కెరీర్ లో ఓ మైలురాయి చిత్రమిది.
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus