కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అతను నటించిన ప్రతీ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ‘యుగానికి ఒక్కడు’ ‘ఆవారా’ ‘నా పేరు శివ’ ‘ఊపిరి’ ‘ ఖాకీ ‘ఖైదీ’ వంటి హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్యనే వచ్చిన హిట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్-1’ లో కూడా అతను నటించాడు. ఆ మూవీ కూడా తెలుగులో కమర్షియల్ హిట్ గా నిలిచింది.
ఇక షార్ట్ గ్యాప్ లో కార్తి నుండి రాబోతున్న మరో చిత్రం ‘సర్దార్’. అభిమన్యుడు ఫేమ్ పి ఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్రిన్స్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది . రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకాబోతుంది.
కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా. ఆల్రెడీ ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వారి రివ్యూ ప్రకారం ఫస్ట్ హాఫ్ బాగుందట. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అలరిస్తుంది అని తెలుస్తుంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ డోస్ ఎక్కువైందని..క్లైమాక్స్ కూడా సో సో గా ఉంది అని చెబుతున్నారు. కార్తి యాక్టింగ్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అని అంతా చెబుతున్నారు.మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి
Expectations from Tamil Diwali releases:#Prince: Hope it turns out to be a sweet and hilarious comedy with plenty of heart.#Sardar: Hope PS Mithran doesn’t stuff it with too many threads, like he did in HERO, and instead focus on one facet to render a compelling thriller.
#Sardar Interval @Karthi_Offl mirattal In Both Characters… Investigation Parts Brilliant.. Camera,BGM
Pre Interval Sequence Goosebumps..
Stage Is Set For Massive 2nd Half…
Idhu Vara Tharam…