మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వారం మంచి కలెక్షన్లను సాధించాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.
రెండో వీకెండ్ కూడా ఈ మూవీ బాగానే పెర్ఫామ్ చేసింది.’సర్కారు వారి పాట’ 10 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
32.81 cr
సీడెడ్
11.16 cr
ఉత్తరాంధ్ర
11.32 cr
ఈస్ట్
8.34 cr
వెస్ట్
5.18 cr
గుంటూరు
8.34 cr
కృష్ణా
5.85 cr
నెల్లూరు
3.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
86.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
6.08 cr
ఓవర్సీస్
11.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
104.35 cr
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.104.35 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.16.65 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. అది సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.