Sarkaru Vaari Paata Collections: ఓటిటి రిలీజ్ ఇచ్చినా.. బాగానే కలెక్ట్ చేసింది..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుంది.పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.3వ వారం కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.అయితే అనూహ్యంగా నిన్న ఈ చిత్రాన్ని రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.దాంతో థియేట్రికల్ పెర్ఫార్మన్స్ పై దెబ్బ పడుతుంది అని అంతా అనుకున్నారు.కానీ నిన్న బాగానే కలెక్ట్ చేసింది ఈ మూవీ.

ఒకసారి ‘సర్కారు వారి పాట’ 22డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 34.89 cr
సీడెడ్ 12.07 cr
ఉత్తరాంధ్ర 12.47 cr
ఈస్ట్  8.93 cr
వెస్ట్  5.63 cr
గుంటూరు  8.59 cr
కృష్ణా  6.29 cr
నెల్లూరు  3.69 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 92.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.93 cr
ఓవర్సీస్  12.68 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 112.17 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 22 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.112.17 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.8.83 కోట్ల షేర్ ను రాబట్టాలి.అది అసాధ్యమే.

విచిత్రంగా ఈ మూవీ నిన్న ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ రూ.18 లక్షల వరకు షేర్ ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బహుశా కొత్త పాటని జోడించడం వల్ల అయ్యుండొచ్చు. ఓటీటీ వెర్షన్ లో మాత్రం ఈ పాట లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus