మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. అయితే సడెన్ గా నిన్న ఓ కొత్త పాటని యాడ్ చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఈ వీకెండ్ కూడా ఈ మూవీ క్యాష్ చేసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే 24 గంటల్లోనే ఈ మూవీని పే పర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. మేకర్స్ ఏ ఉద్దేశంతో ఈ మూవీని పే పర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ చేశారో తెలీదు కానీ…! గంటల వ్యవధిలోనే ఈ మూవీ హెచ్.డి ప్రింట్ పైరసీ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది. దీంతో వెంటనే చాలా మంది ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు.
ఇక్కడ నిర్మాతల ఆలోచన ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతున్న టైంలో పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీకి ఇస్తే అక్కడ సినిమా చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది.మరోపక్క వేలకు వేలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ డబ్బులు పెట్టి చూడటానికి ఇష్టపడరు.ఇలా థియేటర్ బిజినెస్, ఓటీటీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది.
నిర్మాతలు ఇలాంటి లాజిక్స్ పట్టించుకోకుండానే సినిమాని పే పర్ వ్యూ పద్ధతిలో ఎలా వదిలేశారు అనేది అర్ధం కాని ప్రశ్న? ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో థియేటర్ల పరిస్థితితో ఓటీటీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది.