Sarkaru Vaari Paata: మరో 3 భాషల్లో విడుదల కాబోతున్న ‘సర్కారు వారి పాట’!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో మూవీగా నిలిచింది. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు.

విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేసుకునే యువకుడు విలన్ వద్ద తన అప్పు వసూల్ చేసుకోవడానికి రావడం.. తర్వాత ఆ విలన్ వేల కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టి.. సామాన్యులను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలను ఇందులో చూపించారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాగానే ఆడింది. అయితే బాక్సాఫీస్ రన్ ముగిసాక కూడా ఈ మూవీ మరో 3 భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది. అలా అని థియేటర్లో కాదు ఓటీటీలో.

అవును ప్రస్తుతం రెంట్ పద్ధతిలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉన్నప్పటికీ అందరూ ఉచితంగా చూడగలిగేది జూన్ 23 నుండి అని టాక్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి వస్తుందట. నిజానికి తమిళ్ లో కూడా ఈ మూవీని ఏక కాలంలో థియేట్రికల్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అయితే ఓటీటీలో మిగతా భాషల్లో విడుదల చేసినంత మాత్రాన పక్క రాష్ట్రాల జనాలు ఈ సినిమాని చూస్తారా…? ఇది వృధా ప్రయత్నమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus