బోయపాటి శ్రీను (Boyapati Srinu) కథలు బాలయ్యకి తప్ప వేరే హీరోకి సెట్ అవ్వవు అనే సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా యంగ్ హీరోలకి, ప్రజెంట్ జనరేషన్ స్టార్ హీరోలకి సెట్ అవ్వవు అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు అల్లు అర్జున్ (Allu Arjun). బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ‘సరైనోడు’ (Sarrainodu). ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సమ్మర్ హాలిడేస్ బాగా కలిసి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఎగబడ్డారు. తమన్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ఆ టైంకి అల్లు అర్జున్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘సరైనోడు’ నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 19.12 cr |
సీడెడ్ | 10.73 cr |
ఉత్తరాంధ్ర | 8.05 cr |
ఈస్ట్ | 5.15 cr |
వెస్ట్ | 4.52 cr |
గుంటూరు | 5.37 cr |
కృష్ణా | 4.08 cr |
నెల్లూరు | 2.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 59.34 cr |
కేరళ | 3.04 cr |
కర్ణాటక | 6.25 cr |
ఓవర్సీస్ | 3.99 cr |
రెస్ట్ | 1.25 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 73.87 cr |
‘సరైనోడు’ (Sarrainodu) చిత్రం రూ.53.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా రూ.73.87 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.20.47 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.