హీరోగా రాణించాలి అంటే టాలెంట్ ఉంటే సరిపోదు. లక్ కూడా కలిసి రావాలి అంటుంటారు. అన్ని వేళలా ఇది కరెక్ట్ అని చెప్పలేం. కొంతమంది హీరోలు సరైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుని హిట్లు కొడుతూ ఉంటారు. సుహాస్ (Suhas) లాంటి వాళ్ళు అనమాట. అయితే ఇంకొంతమంది హీరోల వద్దకి బ్లాక్ బస్టర్ కథలు వెళ్లినా వాళ్ళు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజ్ తరుణ్ (Raj Tarun) ఈ కోవలోకే వస్తాడు. ‘టాక్సీ వాలా’ (Taxiwaala) ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) వంటి బ్లాక్ బస్టర్ కథలు ముందుగా అతన్ని వెత్తుకుంటూనే వెళ్లాయి.
కానీ అతను వాటిని ఎంపిక చేసుకోలేదు. సో ఇలాంటి వాళ్ళ విషయాల్లో లక్ అనేది కూడా ఉండాలి. ‘సత్య దేవ్’ కి (Satyadev Kancharana) ఇవి రెండూ వర్తిస్తాయి. అతను మంచి టాలెంటెడ్ హీరో. కెరీర్ ప్రారంభంలో పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. తర్వాత హీరోగా మారాడు. ‘బ్లఫ్ మాస్టర్’ (Bluff Master) ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) వంటి మంచి సినిమాలు ఇతను చేశాడు. లాక్ డౌన్ టైంలో ఎక్కువగా ఓటీటీ కంటెంట్ తో అలరించింది సత్య దేవ్ అనే చెప్పాలి.
లాక్ డౌన్ వల్ల సత్యదేవ్ దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నారు. కానీ లాక్ డౌన్ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు ఏవీ ఆడలేదు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) అయితే వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో కోటి షేర్ కూడా ఈ మూవీ సాధించలేదు. అంత టాలెంట్ ఉన్నా.. రాజమౌళి (Rajamouli) , చిరంజీవి(Chiranjeevi) వంటి స్టార్లు అందరూ సపోర్ట్ చేస్తున్నా ఎందుకో సత్యదేవ్ కి కమర్షియల్ సక్సెస్ పడట్లేదు.అతను ఇంకెన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలి?’ అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి.