Satyadev: ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ గురించి సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ల పై ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న సత్యదేవ్ ఈ సినిమా గురించి అలాగే తన డ్రీం ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. చిరంజీవితో పనిచేస్తే 44 ఏళ్ళ అనుభవం వచ్చినట్టే అని చెప్పిన సత్యదేవ్ కు.. ‘ఇప్పటి వరకు టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోలతో పనిచేశారు.

ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్, మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో.. ‘ ‘సరిలేరు నీకెవ్వరు’, పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, చిరంజీవితో బ్యాక్ టు బ్యాక్ ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో చేశారు. మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో ఎప్పుడు చేస్తారు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సత్య దేవ్ బదులిస్తూ.. ‘అందరితో చేయడానికి మంచి రోల్స్ దొరికాయి..

కొన్ని కెరీర్ ప్రారంభంలో చేశాను.మంచి రోల్స్ దొరికితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా నటిస్తాను. నిజానికి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అతని సినిమాలో నటించాలని నాకు ఉంది’ అంటూ సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus