ఇటీవల నారా రోహిత్ నటించిన చిత్రాలు సరైన విజయాలు సాధించలేదు. దర్శకుడు పవన్ సాధినేని తొలిచిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’ విడుదలై రెండేళ్లు దాటింది. నందిత ఖాతాలోనూ ఏవరేజ్ చిత్రాలు ఉన్నాయి. ఈ ముగ్గురి కలయికలో కొత్త నిర్మాత ‘సావిత్రి’ పేరుతో ఓ చిత్రం తీశారు. ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. మరి సినిమా సంగతి? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ :
దొరబాబు (మురళీశర్మ) రెండో కూతురు సావిత్రి (నందిత)కు పెళ్లంటే మహా ఇష్టం. పెళ్లి కుదిరిన శుభ తరుణంలో బామ్మ మొక్కు తీర్చుకోవడానికి శిరిడి బయలుదేరింది. ట్రైనులో సావిత్రిని చూడగానే రిషి (నారా రోహిత్) ప్రేమించేస్తాడు, వెంట పడుతుంటాడు. సావిత్రి అతడిపై కోప్పడుతుంటుంది. రిషిలో మాత్రం ప్రేమిస్తుందనే నమ్మకం. ఇంతలో ఓ షాక్.. పెళ్లికొడుకు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. ఇంట్లో మరో పెళ్లి కుదురుస్తారు. సావిత్రి కోసం రిషి వాళ్ల ఊరు వస్తాడు. అప్పుడు ఏం జరిగింది? మొదటి పెళ్లికొడుకు ఎవర్ని ప్రేమించాడు? సావిత్రి రిషిని ప్రేమించిందా? ఎవర్ని పెళ్లి చేసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.