Sehari Movie: ‘సెహరి’ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి..!

హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సెహరి’. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి కుదిరిన ఓ హీరో తనకంటే నాలుగేళ్లు పెద్దదైన మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. దీంతో తన పెళ్లిని ఎలా అయినా క్యాన్సిల్ చేయాలని చూస్తుంటాడు.

Click Here To Watch

ఈ విషయంలో తన ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడు. ట్రైలర్ ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ ను అందుకుంది. సెన్సార్ టాక్ ఏంటంటే.. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని.. కామెడీ కూడా బాగుందని అంటున్నారు. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్ హైలైట్ గా నిలుస్తుందని టాక్.

హీరో అండ్ గ్యాంగ్ చేసే అల్లరి పనులు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయట. ఈ సినిమాకి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, సంగీత దర్శకుడు కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి – శిల్పా చౌదరీ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus