హర్ష్ కనుమిల్లి హీరోగా పరిచయమవుతూ చేసిన రామ్ కామ్ ఎంటర్టైనర్ ‘సెహరి’. సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. ‘వర్గో పిక్చర్స్’ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలకాబోతుంది.టీజర్, ట్రైలర్ లు యూత్ ను బాగానే ఆకర్షించాయి. ‘ఇది చాలా బాగుందిలే’ ‘సెహరి’ వంటి పాటలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో సినిమా పై కొంతమేర అంచనాలు నెలకొన్నాయి.
అయితే థియేట్రికల్ బిజినెస్ మాత్రం అంతంతమాత్రమే జరిగింది. ‘ఖిలాడి’ వంటి పెద్ద సినిమా ఉండడంతో ‘సెహరి’ కి ఎక్కువ థియేటర్లు దొరకలేదు. కానీ చిత్రబృందం మాత్రం తమ మూవీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 0.31 cr |
సీడెడ్ | 0.15 cr |
ఆంధ్రా(టోటల్) | 0.36 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 0.82 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.09 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 0.91 cr |
‘సెహరి’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయినప్పటికీ అడ్వాన్స్ బేసిస్ వంటి వాటి ప్రకారం రూ.0.91 కోట్ల వరకు బిజినెస్ ను చేసిందట ఈ మూవీ. ఆ రకంగా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కు రూ.1 కోటి వరకు షేర్ ను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది. హిట్ టాక్ వస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీనే కానీ.. పోటీగా రవితేజ ‘ఖిలాడి’, ‘డిజె టిల్లు’, ‘ఎఫ్.ఐ.ఆర్’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని ఈ మూవీ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి..!
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!