శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఒక ఫీల్ ఉంటుంది. కాలేజీ కుర్రాళ్లు, అప్పుడే జాబ్‌లో జాయిన్ అయిన యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఆయన సినిమా తీస్తూ వచ్చారు. ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన ఆలోచనలు మాత్రం అలానే ఉంటూ వచ్చాయి. అయితే మొత్తం కెరీర్‌లో ఆయన చేసిన ఏకైక సీరియస్ సినిమా ‘అనామిక’. ఆ రీమేక్ కోసమే ఆయన ‘సీరియస్’ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి సీరియస్ కథనే ఎంచుకున్నారు అని సమాచారం.
సాఫ్ట్ అండ్ ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తారనే పేరున్న శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున సినిమా కోసం అలాంటి కథనే రాశారు అనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు, సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశం ప్రకారం చూస్తే ఇది సీరియస్‌గా సాగే కథ అని, అంతేకాదు ఓ మాఫియా నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైంది.
ఈ క్రమంలో ఈ సినిమా ముంబయి బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ అని తెలిసింది. 90వ దశకంలో దేశాన్ని వణికించిన మాఫియా మూలాలు ముంబయిలోని ధారవి ప్రాంతంలో ఉన్నాయి అంటారు. అంతర్జాతీయ పోలీసులను కూడా వణికించిన దావూద్ ఇబ్రహీం చరిత్ర మొదలయ్యింది అక్కడే. ఈ నేపధ్యాన్ని తీసుకుని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఓ ఇంటెన్స్ డ్రామాని రూపొందించారని టాక్. అయితే ఈ సినిమాకు దావూద్‌కు ఎలాంటి సంబంధం ఉండదట.
అప్పటి పరిస్థితుల ఆధారంగా సొంతంగా రాసుకున్న కథ ఈ సినిమా అంటున్నారు. అయితే దీని కోసం అలాంటి మాఫియా సినిమాలను చాలా వరకు రిఫరెన్స్‌లుగా తీసుకున్నారని అని టాక్. ఈ సినిమాలో నాగ్ ముంబయి డాన్‌గా కనిపించబోతున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల తిరుపతిలో చేశారని వార్తలొచ్చాయి. అయితే వివిధ కారణాల వల్ల షూటింగ్ రెండో రోజు నిలిపేశారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి స్పష్టత కానీ, సమాచారం కానీ, ఖండన కానీ లేవు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!