Sekhar Kammula, Nani: క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే మామూలుగా ఉండదు..!

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) .. వరుసగా సినిమాలు చేసే రకం కాదు. తన కథకు తగ్గట్టు ముందుగా నిర్మాతని సెట్ చేసుకుని.. ఆ తర్వాత హీరో వద్దకి వెళ్తూ ఉంటాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఓ పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది. ఆయన సినిమాల్లో సన్నివేశాలు నేచురల్ గా ఉంటాయి. పాటలు అయితే అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ధ‌నుష్ (Dhanush) – నాగార్జున‌ల‌తో (Nagarjuna) ‘కుబేర’ అనే ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సాగుతుంది.

శేఖర్ కమ్ముల రూటు మార్చి చేస్తున్న యాక్షన్ డ్రామా ఇది. ఈ ఏడాదే ‘కుబేర’ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. దీని తర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ఏ హీరోతో సినిమా చేస్తాడు? అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. శేఖర్ కమ్ముల అయితే ఓ కథ డిజైన్ చేసుకున్నాడు. దాని అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట. నానికి (Nani) నేచురల్ స్టార్ అనే బిరుదు ఉంది. శేఖర్ కమ్ముల తీసే నేచురల్ మూవీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు.

ఈ ఇద్దరి కాంబో సెట్ అయితే కచ్చితంగా మనం ఓ బ్యూటిఫుల్ మూవీ చూడొచ్చు అనడంలో సందేహం లేదు. ఏసియ‌న్ సునీల్ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. నాని ప్ర‌స్తుతం ‘స‌రిపోదా శ‌నివారం’ (Saripodhaa Sanivaaram) అనే ఫాంటసీ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు.ఆగస్టు 29న అది రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ‘హిట్ 3’ మొదలుపెడతాడు. ఈ లోపు శేఖర్ కమ్ముల ‘కుబేర’ ని కంప్లీట్ చేస్తాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus