అలనాటి టాప్ హీరోల్లో ఒకరైన కాంతారావు..అభిమానులు ముద్దుగా ఆయన్ని కత్తి కాంతారావు అని పిలుచుకునే వారు….అన్నగారు, అక్కినేని గారి తరువాత అంతటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తారల్లో కాంతారావు ఒకరు. ఇంకా చెప్పాలి అంటే…ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు వచ్చింది ఈయనకే..అంతే కాదు ఎన్టీఆర్ మెచ్చిన నటుడు కూడా కాంతారావు కావడం విశేషం. అలనాడు…సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రల్లో జీవించి వాటికి ప్రాణం పోశారు. అయితే తన తొలి సినిమా నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన….దాదాపుగా 400చిత్రాలకు పైగా నటించారు.
అదే క్రమంలో సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇదిలా ఉంటే ఆరోజుల్లో విఠలాచార్య, కాంతారావు కాంబినేషన్ అంటే అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. మాయలు..మంత్రాలు, దెయ్యాలు వాటితో పోరాటాలు అప్పట్లోనే చాలా వరకు గ్రాఫిక్స్ ఉపయోగించి చిత్రాలు తీశారు. అందుకే కాంతారావు అప్పట్లో గండర గండడు,కత్తి కాంతారావు అని పిలిచే వారు. అయితే ఇందంతా గతం…2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులో ని యశోద హాస్పిటల్ లో కాంతారావు తుది శ్వాస విడిచిన తరువాత ఆయన కుటుంభం కష్టాల్లో పడింది.
ఆర్థికంగా చాలా దీనావస్థలో కూరుకుపోయింది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రముఖ లాయర్, నటుడు నరసింహారావు, కాంతారావు ఫ్యామిలీని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా…ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆయన కుటుంభం ఇప్పుడు కష్టాల్లో ఉండడం నిజంగా బాధ కలిగించే విషయమే….మరి దాతలు ఎవరైన ముందుకు వచ్చి ఆదుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.