రాజమౌళిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే కాక టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ పటంలో నిలబెట్టారు దర్శకధీరుడు రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ సాంగ్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకుని వారం రోజులు దాటినా ఇంకా జక్కన్న మీద ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ట్రిపులార్ టీమ్‌ని ఘనంగా సత్కరించాలని సన్నాహాలు చేస్తున్నాయి.. అయితే తాజాగా ఓ సీనియర్ నటి రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేశారు..

‘బాహుబలి’ లో నటించమని తనను సంప్రదించి.. కేవలం పారితోషికం కారణంగా పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చారు.. వివరాల్లోకి వెళ్తే.. నటి కాంచన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండరీ యాక్టర్లతో జత కట్టిన కాంచన మంచి మనసున్న నటిగా పేరు తెచ్చుకున్నారు.. సొంత తల్లిదండ్రులే ఆమెకు విషం పెట్టి చంపాలనుకున్నారు.. దీంతో ఆమె అందర్నీ వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నారు.. సినిమాల్లో చాలా సంపాదించారు కాంచన.. తల్లిదండ్రులు మోసం చేయడంతో వారిపై కోర్టులో పోరాడి కొంత ఆస్తి దక్కించుకున్నారు..

కాగా ఇటీవల ఓ ఇంటర్వూలో ఆమె, రాజమౌళి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘బాహుబలి’ లో నటించడానికి తనను కాంటాక్ట్ అయ్యారని.. రూ. 5 లక్షలు పారితోషికం కావాలంటే పక్కన పెట్టేశారని అన్నారు.. తన లాంటి సీనియర్ నటికి రూ. 5 లక్షలు ఇవ్వలేని స్థితిలో రాజమౌళి లేరు కదా అని ప్రశ్నించారామె.. ఆ డబ్బు వారికి పెద్ద విషయమే కాదని.. తనలాంటి వారికిస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుందని అన్నారు..

కాంచన వ్యాఖ్యలు జక్కన్న వరకు వెళ్తాయో లేదో.. ఒకవేళ తెలిస్తే ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాలి.. ఇదిలా ఉంటే గతంలో ‘బాహుబలి’ లో శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అనుకున్నారని.. ఆమె పారితోషికం డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నారని రాజమౌళి చెప్పడం.. అలాగే రాజమౌళి చేసిన కామెంట్స్ అవాస్తవమంటూ బోనీ కపూర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus