సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. కొంతమంది అనారోగ్య సమస్యలతో, ఇంకొంతమంది ప్రమాద వశాత్తు, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. వయసు మీద పడ్డ వాళ్ళు కూడా చాలా మంది మరణిస్తున్నారు. ఈ ఏడాది అప్పుడే కోటా శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటులను కోల్పోయాం. ఇటీవల కె.జి.ఎఫ్ నటుడు హరీష్ రాయ్ కూడా మరణించారు.
Kamini Kaushal
షోలే నటుడు ధర్మేంద్ర కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి.. కానీ అవి అవాస్తవాలు అయ్యాయి అని తెలుసు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ నటి అయినటువంటి కామినీ కౌశల్ మృతి చెందారు.ఆమె వయస్సు 98 ఏళ్ళు. కొన్నాళ్లుగా ఆమె వయోభారంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ వస్తోంది.
అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది.1927లో జన్మించిన కామినీ కౌశల్.. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదటి సినిమాతోనే కేసిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డుని సొంతం చేసుకుంది. 1946లో ‘నీచా నగర్’తో ప్రారంభమైన ఆమె సినీ కెరీర్.. 7 దశాబ్దాల పాటు సాగింది. ‘బడే సర్కార్’ ‘జిడ్డీ’ ‘షాహీద్’ ‘జైలర్’ ‘నైన్ కతబ్’ ‘గోడాన్’..వంటి సినిమాల్లో నటించింది. అలాగే ‘కబీర్ సింగ్’ ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించింది.