Ravi Teja: హీరో రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ డైరెక్టర్..!

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సాగర్.. స్టార్ హీరో రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అవి కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు రవితేజనే ఎందుకు ఈ డైరెక్టర్ టార్గెట్ చేసాడు అనే డిస్కషన్లు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గతంలో ఈ దర్శకుడితో రవితేజ ‘అన్వేషణ’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దు అంటూ రవితేజ అభ్యంతరం వ్యక్తం చేసాడట. ‘ఇది కచ్చితంగా ప్లాప్ అవుతుంది.. నా కెరీర్ నాశనమవుతుంది’ అనే ఉద్దేశంతోనే..

రవితేజ ఈ సినిమాను విడుదలను అడ్డుకోవడానికి రెడీ అయ్యాడట. అయితే ‘కథ నీకు నచ్చే నటించావు.. ఇప్పుడు విడుదల చేయొద్దు అనడం ఎంతవరకూ కరెక్ట్?’ అంటూ దర్శక నిర్మాతలు నిలదీశారట.అతని మాట కాదని రిలీజ్ చేశారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. కమర్షియల్ గా నిర్మాత లాభపడ్డారు అని టాక్. అయితే రవితేజ ఈ సినిమా రిలీజ్ చేయొద్దు.. నా కెరీర్ పై ఈ సినిమా రిజల్ట్ ప్రభావం చూపిస్తుంది అనడం వెనుక కూడా ఓ కారణం ఉంది. అదేంటి అంటే..

ఈ ‘అన్వేషణ’ ను ‘నీకోసం’ సినిమా కంటే ముందుగానే తెరకెక్కించారట. కానీ తొందరగా రిలీజ్ చేయలేదు. అయితే ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ ‘ఇడియట్’ వంటి హిట్ సినిమాలతో రవితేజ స్టార్ గా ఎదిగాడు.అతని మార్కెట్ కూడా పెరిగింది. దాంతో ఆ టైములో ‘అన్వేషణ’ ను విడుదల చేసుకుంటే క్యాష్ చేసుకోవచ్చు అని నిర్మాతలు భావించి రవితేజకు ఇష్టం లేకపోయినా రిలీజ్ చేశారు.సినిమా ప్లాప్ అయినా అదృష్టం కొద్దీ రవితేజ భయపడినట్టు ఏమీ జరగలేదు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus