తమిళంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు విజయ్ కాంత్. 1980-90ల టైంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు విజయ్ కాంత్. ముఖ్యంగా పోలీస్ రోల్స్ కు ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యేవారు. ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 1979లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కాంత్ 3 దశాబ్దాల పాటు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.
ఒకానొక టైంలో ఈయన రజనీకాంత్ తమ్ముడు అంటూ ఓ రూమర్ వచ్చింది. దాని గురించి ఇటీవల ఓ దర్శకుడు కూడా సెటైరికల్ గా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఫేడౌట్ అయిపోయిన హీరోలు, వయసు మీద పడ్డ హీరోలు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నట్టు అనే డైలాగ్ ను నిజం చేస్తూ ఈయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులో డీఎండీకే పార్టీని స్థాపించారు విజయకాంత్ . 2006, 2011 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన విజయ్ కాంత్..
ఈ మధ్య కాలంలో ఫామ్ కోల్పోయారనే చెప్పాలి. మరోపక్క ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు. కొంతకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు మొన్నామధ్య వైద్యులు విజయ్ కాంత్ కాలికి ఉన్న మూడు వేళ్ళను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… మంగళవారం నాడు అంటే జనవరి 30న విజయ్ కాంత్– ప్రేమలత దంపతుల పెళ్లిరోజు.
ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు, అభిమానులు విజయ్‌కాంత్ దంపతులకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ విజయ్ ను కలవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు విజయ్ కాంత్ లుక్ ను చూసి షాకవుతున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఆయన మారిపోయారు.