Vikram K Kumar: సూర్య సినిమాకి సీక్వెల్ ఉంటుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త్రిపాతాభినయం చేసిన సినిమా ’24’. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్య కెరీర్ లో అత్యున్నత స్థాయిలో తెరకెక్కిన సినిమాల్లో ’24’ ఒకటి. ఇండియాలో వచ్చి బెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు. ఇందులో హీరో, విలన్ పాత్రల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా విలన్ ఆత్రేయ రోల్ లో ఆయన పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది.

ఈ సినిమా రిలీజ్ సమయంలో దీని సీక్వెల్ గురించి చర్చ జరిగింది కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ ఆ చర్చ లేకపోయింది. అయితే విక్రమ్ కుమార్ మైండ్ లో మాత్రం ’24’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన తిరుగుతూనే ఉన్నట్లుంది. తాజాగా తన కొత్త సినిమా ‘థాంక్యూ’ ప్రమోషన్స్ లో ’24’ సీక్వెల్ గురించి మాట్లాడారు దర్శకుడు విక్రమ్. ఆత్రేయ పాత్రకు సంబంధించిన కథాంశాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ ’24’ సినిమాకి సీక్వెల్ తీయొచ్చనే ఆలోచన తనకు ఉందని..

కానీ దాని మీద చాలా వర్క్ చేయాల్సి ఉందని అన్నారు. అన్నీ సెట్ అయితే ఫ్యూచర్ లో మళ్లీ సూర్యతోనే ఈ సినిమా తీస్తానని అన్నారు. ఇక తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తోన్న ‘దూత’ వెబ్ సిరీస్ పూర్తి కావొస్తుంది అన్నారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. దీని తరువాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో విక్రమ్ ఇదివరకు ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా తీశారు.

ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఆ సంస్థ విక్రమ్ కి మరో ఛాన్స్ రావడం విశేషమే. అయితే ఇందులో హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అలానే బాలీవుడ్ లో కూడా ఓ యాక్షన్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని.. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక ‘థాంక్యూ’ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus