రోడ్డు ప్రమాదంలో మరణించిన సీరియల్ నటుడు!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు కూడా మరణిస్తూ ఉండటం షాకిచ్చే అంశం. తాజాగా ఓ సీరియల్ నటుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో.. అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతని వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం.

Aman Jaiswal

ఓ సీరియల్ కోసం ఆడిషన్ కి వెళ్లి తిరిగి బైక్ పై వస్తున్న అమన్ జైస్వాల్ (Aman Jaiswal)… ముంబైలో ఉన్న జోగేశ్వరి హైవే వద్ద ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన యావత్ హిందీ టీవీ పరిశ్రమని కుదిపేసింది అని చెప్పాలి. అమన్ మృతికి చింతిస్తూ కొందరు సీరియల్ నటీనటులు.. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక అమన్ జైస్వాల్  (Aman Jaiswal) ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి.

ఇతను ‘ధర్తిపుత్ర నందిని’ అనే సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యాడు. అలాగే సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘ పుణ్యశ్లోక్ అహల్యాబాయి’ అనే సీరియల్లో యశ్వంత్ రావు పాత్రలో కూడా మెప్పించాడు. ఇతను మోడల్ కూడా కావడంతో లేడీ ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇతను మంచి సింగర్ కూడా.! అంతేకాదు బైక్ కూడా బాగా నడుపుతాడు అని అంతా అంటుంటారు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బైక్ రైడింగ్ కి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగినట్లు స్పష్టమవుతుంది.

రాజా సాబ్.. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus