Shaakuntalam OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘శాకుంతలం’

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14 న తెలుగుతో పాటు మలయాళ, తమిళ,హిందీ,కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ని ఆధారం చేసుకుని తెరకెక్కింది. మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ళ,మధుబాల, శివ బాలాజీ,సత్య… వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.

నిర్మాతలైన నీలిమ గుణ, దిల్ రాజుకి రూ.20 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు టాక్ వినిపించింది. దిల్ రాజు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన 25 ఏళ్ళ సినీ చరిత్రలో ‘శాకుంతలం’ పెద్ద జర్క్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కథ మంచిదే అయినప్పటికీ కథనం ఆసక్తికరంగా సాగలేదని, వి.ఎఫ్.ఎక్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక ఈ చిత్రం డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మే 12 న ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటన వచ్చింది. అయితే ఏమైందో ఏమో.. ఓ రోజు ముందుగానే అంటే జూన్ 11 నుండే ‘శాకుంతలం’ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయితే.. ఇక్కడ (Shaakuntalam) ఈ మూవీని చూసెయ్యండి :

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus