Shah Rukh Khan: తెలుగు ప్రేక్షకులకు సినీ పరిజ్ఞానం ఎక్కువ.. షారుక్ ఖాన్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. అయితే చాలా రోజుల తర్వాత షారుక్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక హీరో షారుక్ ఖాన్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఈ క్రమంలోని ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక హఠాన్ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించడంతో

షారుక్ తెలుగు ప్రేక్షకుల గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూస్తారని వారికి సినీ పరిజ్ఞానం ఎక్కువగా ఉందని ఈయన తెలిపారు.దీంతో ఈయన చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కామెంట్స్ చూసి తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus