జబర్దస్త్ షోలో చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన శంకర్ తన కామెడీ టైమింగ్ తో అతి తక్కువకాలంలోనే గ్రూప్ లీడర్ అవకాశం అందుకున్నాడు. షకలక శంకర్ గా అవతారమెత్తి మొదట్లో వరుసగా స్కిట్స్ అదరగొట్టాడు. ఆ తర్వాత స్కిట్స్ ఫెయిల్ కావడం.. సినిమాల్లో అవకాశాలు రావడంతో షోని వదిలేశాడు. హాయిగా చేతినిండా కామెడీ రోల్స్ దొరుకుతున్న సమయంలో హీరో కావాలనే కోరిక రావడం.. తర్వాత తన మిత్రుడు శ్రీధర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తాను హీరోగా నటిస్తూ శంభో శంకర అనే సినిమాని తీశాడు. ఈ చిత్రంపై పూర్తి కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేవాడు. ఆ ఓవర్ తో.. అతిగా మాట్లాడాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి తదితరులపైనా విమర్శలు చేశాడు.
“కథ సూపర్ గా ఉంది.. రెండు కోట్లు పెట్టండి పదికోట్లు వస్తుంది” అని వారిని అడగడం దగ్గర నుంచి.. శంభో శంకర రికార్డు సృష్టిస్తుందని గొప్పలు చెప్పడం వరకు అతి ఎక్కువైంది. అతని మాటలపై సినిమా రిలీజ్ వరకు అందరూ ఆగారు. ఆ చిత్రం ఘోరంగా అపజయం పాలైంది. దీంతో శంకర్ కి అంతా అవసరమా? అంటూ అందరూ విమర్శిస్తున్నారు. త్రివిక్రమ్, దిల్ రాజు మాత్రమే కాదు ఇతర సినీదర్శకనిర్మాతలు కూడా షకలక శంకర్ ని దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారంట. దీంతో శంకర్ తన గొయ్యి తానే తొవ్వుకున్నాడని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బహుశా శంకర్ ఎక్కువ సినిమాల్లో కనిపించకపోవచ్చు. అతను హీరోగా చేస్తోన్న డ్రైవర్ రాముడు సినిమా ఇది వరకే ఆగిపోయింది. సో హీరోగా మరెవరూ ఇచ్చే సాహసం చేయరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.