Shakeela Remuneration: బిగ్ బాస్ 7లో 2 వారాలకు షకీలా ఎంత రెమ్యూనరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే అయ్యో పాపం అంటారు

నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్నబిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ప్రారంభ ఎపిసోడ్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో టాస్కులు ఎవ్వరు ఊహించని విదమైనవి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ ఎంత వాడివేడిగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్స్ చేత నామినేట్ కాబడ్డ వారిలో ఒక్క ఓటు వచ్చిన వారిని కూడా బిగ్ బాస్ నామినేషన్స్ లో నిలబెట్టాడు.

ఇకపోతే ఈ వారం పవర్ అస్త్ర ని గెలిచి శివాజీ నామినేషన్స్ నుండి బయటపడ్డాడు. ఒకవేళ పవర్ అస్త్ర రాకపోయినా కూడా శివాజీ ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. శివాజీ తో పాటుగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు షకీలా , ప్రిన్స్ యావర్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, గౌతమ్ మరియు శోభా శెట్టి. వీరిలో షకీలాకు అతి తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయ్యింది.

ఇంట్లో అందరూ ఆమెని అమ్మా అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు, అందరితో ఆమెకి ఈ రెండు వారాల్లో మంచి బాండింగ్ ఏర్పడింది. కానీ టాస్కులు ఆడే విషయం లో మాత్రం మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే బాగా తక్కువ అవ్వడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. దానికి తోడు ప్రేక్షకుల్లో కూడా ఆమెకి ఆదరణ ఇంతకు ముందు ఉన్న రేంజ్ లో లేదు. అందుకే ఓటింగ్ అనుకున్న స్థాయిలో రావడం లేదు.
ఈమెని (Shakeela ) నామినేట్ చేసిన ఏకైక కంటెస్టెంట్ టేస్టీ తేజా.

అతని వల్లే ఈమె ఎలిమినేట్ అయ్యింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంట్లో అందరికంటే షకీలా కి తేజా తోనే ఎక్కువ బాండింగ్ ఉంది. అలాంటిది తేజా కారణంగానే ఈరోజు ఆమె ఎలిమినేట్ అవ్వబోతుండడం విశేషం. ఇక ఆమె రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను 7 లక్షల రూపాయిలు ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అట. సీనియర్ మోస్ట్ సెలబ్రిటీ కాబట్టే ఆమెకి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చారని అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus