Shakeela: సంబంధం లేకపోయినా వారికి అండగా నిలిచిన షకీలా… గ్రేట్ అంటూ కామెంట్స్!

షకీలా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అన్ని భాషలలోనూ అద్భుతమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపినటువంటి షకీలా ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారని చెప్పాలి. ఒకప్పుడు అడల్ట్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకు ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో ఆ తరహా సినిమాలకు దూరమయ్యారు. అడపాదడపా సినిమా అవకాశాలు రావడంతో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సినిమాలలో కొనసాగుతున్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.ఎక్కడైనా ఒక సమస్య ఉంది, కష్టం వచ్చింది అంటే అక్కడ వాలిపోతూ ఆ సమస్యను తన సమస్యగా భావించి వారికి అండగా నిలుస్తూ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని చులై మేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది.

ఈ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున నివాసముంటున్నారు అయితే ఈ అపార్ట్మెంట్ యాజమాన్యం ఒక్కో ఫ్యామిలీ నుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని, ఇలా వీరు దాదాపు తొమ్మిది వేల రూపాయలు అదనంగా వసూలు చేయడంతో మండిపడినటువంటి అపార్ట్మెంట్ వాసులు ఈ విషయం గురించి యాజమాన్యాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది. ఇలా అపార్ట్మెంట్ యజమానులను నిలదీయడంతో వారు వీరిని చిత్రహింసలకు గురి చేశారు వారి అపార్ట్మెంట్ కి వాటర్ సదుపాయం లేకుండా గత మూడు రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ వాసులు యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న టువంటి షకీలా (Shakeela) అక్కడికి చేరుకొని అపార్ట్మెంట్ వాసులకు మద్దతుగా నిలిచారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇలా తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల తరఫున నిలబడి ఈమె పోరాటం చేయడం గ్రేట్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus