Shaakuntalam: సమంతకు కనీసం ఈ గౌరవం దక్కిందిగా.. సంతోషంలో అభిమానులు!

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

సమంత ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కిందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత సత్తా చాటడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు అవార్డులు క్యూ కట్టాయి. బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. సమంత కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలు మిగిల్చిన సినిమా ఏదీ లేదనే సంగతి తెలిసిందే.

న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ లో కూడా శాకుంతలం సినిమాకు అవార్డ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డ్స్ వచ్చినందుకు కొంతమంది సంతోషిస్తుండగా మరి కొందరు ఈ సినిమాకు అవార్డులు ఎవరిచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శాకుంతలం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సమంత ఈ తరహా సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది చెబుతున్నారు.

సమంత దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన (Shaakuntalam) సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. సమంత 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సమంతకు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus