రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా దిల్ రాజు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త జీవో వల్ల ఈ సినిమాకు ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకున్న పాన్ ఇండియా సినిమాలకు ఏపీ ప్రభుత్వం పది రోజుల పాటు సినిమా టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రామ్ చరణ్ శంకర్ కాంబో సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసింది. రెమ్యునరేషన్లు కాకుండానే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభుత్వం నిబంధనల వల్ల ఏపీలో షూటింగ్ జరుపుకుని లాభపడే చిత్రాలలో చరణ్ శంకర్ కాంబో మూవీ కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
కొత్త టికెట్ల జీవో గురించి ముందుగా అవగాహన లేకపోయినా శంకర్ విజన్ ఈ సినిమాకు ప్లస్ అయింది. భవిష్యత్తులో తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే సినిమాలు ఏపీలో కచ్చితంగా షూటింగ్ జరుపుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దర్శకుడు శంకర్ కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శంకర్ సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది. మరోవైపు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది.
రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే ఆ హీరోల తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. శంకర్ మూవీతో చరణ్ ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయాల్సి ఉంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.