1996లో కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్’ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. తెలుగులో ఈ సినిమా ‘భారతీయుడు’ అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాతో దర్శకుడు శంకర్ క్రేజ్ కూడా పెరిగింది. ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తరువాత సీక్వెల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రబృందం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటినుండి సినిమాకి ఏదొక అవాంతరం వస్తూనే ఉంది. షూటింగ్ సెట్ లో యాక్సిడెంట్ అయి టెక్నీషియన్స్ చనిపోయారు.
ఈ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నారు. ఆ తరువాత పాండమిక్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలవుతుందని భావించారు. కానీ అది జరగలేదు. కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. మరోపక్క శంకర్.. రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేశారు. దీంతో ‘ఇండియన్ 2’ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా విషయంలో మద్రాస్ హైకోర్టుని సంప్రదించింది.
‘ఇండియన్ 2’ సినిమా పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమా మొదలుపెట్టడానికి వీళ్లేదంటూ హైకోర్టుని ఆశ్రయించారు లైకా నిర్మాతలు. ఈ సినిమాను నిర్మించడానికి మొత్తం రూ.230 కోట్ల బడ్జెట్ కేటాయించామని.. ఇప్పటికే ప్రొడక్షన్ లో భాగంగా రూ.180 కోట్లు ఖర్చు చేశామని లైకా సంస్థ కోర్టుకి తెలిపింది. మిగిలిన డబ్బుని కోర్టులో జమ చేయడానికి లైకా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ ఇతర చిత్రాలకు వెళ్లకుండా ఆపాలని కోర్టుని కోరింది. ఈ విషయంలో కోర్టు శంకర్ కి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. మరి శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి!
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!