Sharwanand, Nithin: శర్వానంద్ ఈసారైనా సక్సెస్ సాధిస్తారా?

ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ పరిస్థితి బాలేదనే సంగతి తెలిసిందే. శర్వానంద్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం లేదు. శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం షూటింగ్ పూర్తైనా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. శర్వానంద్ గత సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. అయితే శర్వానంద్ తాజాగా మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

కృష్ణచైతన్య డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ కథ నితిన్ రిజెక్ట్ చేసిన కథ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. అటు శర్వానంద్ కు ఇటు రాశీఖన్నాకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. కృష్ణచైతన్య నితిన్ తో పవర్ పేట అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

కృష్ణచైతన్య సినిమా కోసం శర్వానంద్ బరువు తగ్గుతున్నారని శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు శర్వానంద్ 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. శర్వానంద్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సిన పరిస్థితి నెలకొంది. పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

కృష్ణచైతన్య స్పందిస్తే మాత్రమే ఈ సినిమా నితిన్ రిజెక్ట్ చేసిన కథతో తెరకెక్కుతుందో లేక కొత్త కథతో తెరకెక్కుతుందో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. శర్వానంద్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ మినహా మరే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus