హీరో శర్వానంద్, 14 రీల్స్ ప్లస్ మధ్య రెమ్యునరేషన్ బకాయి విషయం మీడియాకు లీకులు ఇవ్వడంలో ఓ దర్శకులు కీలక పాత్ర పోషించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘శ్రీకారం’ సినిమా డబ్బింగ్ సమయానికి రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వాలని హీరోకి, నిర్మాతలకు మధ్య అగ్రిమెంట్ ఉంది. కానీ అలా చేయకుండానే సినిమాను విడుదల చేశారు. అయితే హీరోకు కొన్ని చెక్కులు ఇచ్చారు. సినిమా విడుదలై చాలా కాలం అవుతుంది. అయితే నిర్మాతలు మాత్రం రెమ్యునరేషన్ గురించి మాట్లాడకపోవడంతో..
శర్వా చాలా రకాలుగా ప్రయత్నించి చివరికి నిర్మాతలు ఇచ్చిన చెక్కులు బ్యాంక్ లో వేశాడు. అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో శర్వా లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు కూడా ఈ విషయం బయటకి రానివ్వకుండా గుట్టుగా ఉంచారు. ఇలాంటి సమయంలో 14 రీల్స్ తో సంబంధాలు ఉన్న ఓ డైరెక్టర్ ఈ విషయాన్ని బయటకి లీక్ చేసినట్లు లేటెస్ట్ సమాచారం. నిర్మాతల పట్ల సింపతీ ఉండడం..
హీరో ఇలా చేయడం ఏంటనే ఆలోచనలతోనో.. మరో ఉద్దేశంతోనే కానీ ఆ దర్శకుడు తన స్నేహితుల ద్వారా శర్వా ఇష్యూని బయట పెట్టేశాడు. ఆ విధంగా హీరో, నిర్మాతల వ్యవహారం బయటకొచ్చింది. మరి దీనిపై శర్వా స్పందిస్తాడేమో చూడాలి!
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!