శర్వానంద్ ప్లానింగ్ మాములుగా లేదు!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బందిపడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జాను’ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో డీలా పడ్డాడు. అయితే లాక్ డౌన్ లో తన ప్లానింగ్ మొత్తాన్ని మార్చుకున్నాడు ఈ హీరో. గతంలో మాదిరి ఒక సినిమా తరువాత మరొకటి అని కాకుండా వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. కరోనా కారణంగా అగ్ర హీరోల సినిమాలు ఇప్పట్లో విడుదలయ్యేలా కనిపించడం లేదు. పండగ సీజన్లలో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా ఉండకపోవచ్చు.

‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు దసరా వరకు వచ్చేలా లేవు. ‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలు 2022లోనే రిలీజ్ అవుతాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు ముందుకు వచ్చినా.. కానీ వచ్చే ఏడాది పూర్తిగా మిడిల్ రేంజ్ సినిమాల హవానే నడుస్తుంది. ఈ సంగతి అర్ధం చేసుకున్న శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సిట్యుయేషన్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను నటిస్తోన్న రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

మరో మూడు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్తాయి. 2021లో కనీసం మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా శర్వానంద్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలతో హిట్లు అందుకుంటే.. తన మార్కెట్ రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు. అందుకే మునుపటి కంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకొని నిర్మాతలను మరింతగా ఆకర్షిస్తున్నాడు. మిడిల్ రేంజ్ హీరోలంతా మునుపటి కమిట్మెంట్లతో బిజీగా ఉండడంతో శర్వానంద్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus