Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి కొత్తిల్లు కూలిపోయిందట.. వైరల్ అవుతున్న వీడియో..!

సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు అందరికీ ఒక లక్ష్యం ఉంటుంది. అదే సొంతిల్లు నిర్మించుకోవాలనుకునేది. అందుకోసం తలకు మించిన భారంగా అప్పు చేసి.. నెల నెలకు వడ్డీలు కట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతుంటారు. అయితే ఎంతో ముచ్చటపడి కట్టుకున్న లేదా కొనుగోలు చేసిన ఇల్లు.. గృహప్రవేశం జరగక ముందు కూలిపోయే పరిస్థితికి వస్తే.. ఎవ్వరికైనా ప్రాణం నీరుకారిపోతుంది కదా. అలాంటి పరిస్థితి బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ జ్యోతికి వచ్చింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తన ఇంటి డిజైనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది శివ జ్యోతి. అందుకు సంబంధించి ఆమె చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పలు న్యూస్ ఛానల్స్ లో పనిచేసిన శివజ్యోతి తీన్మార్ వార్తలు చదువుతూ తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్ 3’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శివ జ్యోతి.. ఆ షోతో మరింత పాపులర్ అయ్యింది. హైదరాబాద్ లో భర్త గంగూలీతో కలిసి ఉంటున్న ఆమె .. సొంతంగా ఓ ఇల్లు నిర్మించుకుంది.

అలాగే కొన్నాళ్ళకు కొత్త కారు కూడా కొనుగోలు చేసింది. అప్పుడప్పుడు తన అత్తగారి ఇంటికి వెళ్లొస్తున్న శివ జ్యోతి ఇప్పుడు వారి కోసమని ఓ ఇల్లు నిర్మించుకుంటుంది. అయితే ఆ ఇంటిలోని ఇంటీరియర్ పూర్తిగా ఫెయిలైందట. సీలింగ్ కూడా సరిగ్గా లేదని, కూలిపోవడానికి రెడీగా ఉందని…. అలానే తలుపులకు, బాత్ రూమ్ లో స్టిక్కర్లు అతికించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus